- Advertisement -
చర్లపల్లి డివిజన్ పరిధిలోని మింట్ కాలనీ, గాంధీనగర్, ఆఫీసర్స్ కాలనీ, మహాలక్ష్మి నగర్, రైల్వే కాలనీ, బి ఎన్ రెడ్డి నగర్ కాలనీలను పారిశ్రామిక జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ గా, నవోదయనగర్ కాలనీని పారిశ్రామిక జోన్ గా మారుస్తూ శనివారం ప్రభుత్వం జీ.ఓ. విడుదల చేయటం తెలిసిన విషయమే.
అయితే ఈ సందర్భంగా ఆయా కాలనీ వాసుల తరపున కాలనీ సంఘాల ప్రతినిధులుతో మంత్రి మల్లారెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్ ,ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్,ఉప్పల్ అసెంబ్లీ పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -