దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు…అప్ డేట్

288
dubbaka
- Advertisement -

తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై చాలా ఉత్కంఠ నెలకొంది. నేడు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వెల్లువడనున్నాయి. ఈమేరకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఒట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు.. 23 రౌండ్లుగా ఉంటాయి. దుబ్బాక నియోజకవర్గంలోని 315 పోలింగ్‌ కేంద్రాల్లో 1,64,192 ఓట్లు పోలయ్యాయి. ఈవీఎంలను ఓపెన్‌ చేయడం, వాటిని లెక్కించడం త్వరత్వరగానే పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. అదే విధంగా 1,453 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, 51 సర్వీస్‌ ఓట్లు ఉన్నాయి. వీటిని ముందుగానే లెక్కించనున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ఫలితాలపై మరింత ఉత్కంఠను పెంచాయి.

- Advertisement -