గులాబీ పార్టీ అంటే ఫ్లవర్‌ కాదు…ఫైర్: మల్లారెడ్డి

162
mallareddy
- Advertisement -

పుష్ప సినిమా డైలాగ్‌లతో ఇరగదీశారు మంత్రి మల్లారెడ్డి. ఆ సినిమాలో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ను తనదైన స్టైల్‌లో చెప్పి నవ్వులు పూయించారు మల్లారెడ్డి. గులాబీ పార్టీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాళ తీసిందని…బీజేపీ అంటే ప్రజల ఆస్తులను అమ్మే పార్టీ అని మండిపడ్డారు. టీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ అని చెప్పారు.

ఒక‌ప్పుడు పాలు అమ్మి జీవ‌నం కొన‌సాగించిన నేను పార్ల‌మెంట్ స్థాయికి ఎదిగాను. నిరంత‌రం క‌ష్ట‌ప‌డ్డాను కాబ‌ట్టే దేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేష‌న‌లిస్ట్‌గా ఎదిగి.. స‌క్సెస్‌కు ఒక మోడ‌ల్‌గా నిలిచాను అని చెప్పారు.

46 ఏండ్ల జ‌ర్నీలో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను. అనేక బిజినెస్‌లు చేశాను. ఇంత పెద్ద స‌క్సెస్ అయ్యానంటే ఆషామాషీ కాదు అన్నారు. నేనేం మంత్రాలు చేయ‌లేదు. నేనేం బాబాను కాదు. నాకు ఫారెన్ ఫండ్స్ రాలేదు. ప్ర‌తి రూపాయి ఇక్క‌డే సంపాదించా…అందుకే స‌మ‌యం వృథా చేయ‌కుండా నాలా క‌ష్ట‌పడాల‌ని యువ‌త‌కు మ‌ల్లారెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -