కబడ్డీ ఆడిన మంత్రి మల్లారెడ్డి…

25
mallareddy

వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో భాగంగా అలవర్చుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటామన్నారు మంత్రి మల్లారెడ్డి. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పాలకవర్గం మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా మేడిపల్లిలోని హనుమాన్‌ దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ మీట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి ఉత్సాహ పరిచారు. ఆటలతోనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. కబడ్డీతో పాటు క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాట్‌మెంటన్‌, టెన్నికేయిట్‌, క్యారమ్‌, చెస్‌, షటిల్‌, తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌గౌడ్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.