మెగా హీరోను అభినందించిన బాలయ్య..

33

వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన సినిమా ‘ఉప్పెన’. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ కాగా, తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రసంశలతో పాటు కమర్షియల్ విజయం కూడా అందుకుంది. వారం రోజుల్లోనే 70 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. టాలీవుడ్‌లో పలువురు ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో ‘ఉప్పెన’ చిత్రాన్ని వీక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆస్వాదించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ నటీనటులు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలను అభినందించారు. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా అయినా కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా అనుభవం ఉన్న నటుడిలా కనిపించాడని ప్రశంసించాడు బాలయ్య.