- Advertisement -
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్క రించుకొని మేయర్ మేకల కావ్య,డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో సుమారు 200 వందల మంది మహిళలు, జవహార్ కార్పొరేటర్‌లు పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే రీతిలో సంక్రాంతి పండుగ కనువిందు చేసే రీతిలో వివిధ రకాల ఆకృతిలో వేసిన ముగ్గులు అబ్బురపరిచాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి, రైతు బంధుతో సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలుపుతూ తెలుగు ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -