ఆదోనిలో దారుణం.. అత్త చెవి కోసిన అల్లుడు..

16

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం చోటు చేసుకుంది. ఆదోని పట్టణంలోని మరాఠీ వీధిలో అత్త,భార్యపై అల్లుడు నరేష్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అత్త సావిత్రమ్మకు చెవి తెగిపోగా, భార్య మాధవి తలకు గాయాలు అయ్యాయి.ప్రస్తుతం ఇద్దరూ ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 13 నెలల క్రితం మాధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్… మద్యానికి బానిసై డబ్బులు కోసం తరచూ భార్యను వేధించసాగాడు.

భర్త వేధింపులు భరించలేక రెండు నెలల క్రితం మాధవి పుట్టింటికి వచ్చింది.దీంతో నిన్న అత్తారింటికి వచ్చి అత్త, భార్యపై దాడి చేశాడు.దాడిలో గాయపడ్డ తల్లి,కూతురిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నరేష్‌ను అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.