కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి..

66
- Advertisement -

మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, కిసార, ఘట్కేసర్ మండలాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 97 లబ్దిదారులకు అందజేయడం జరిగిందజేశారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే సీఎం కే.సి.ఆర్ లక్ష్యమన్నారు.

సిఎం కేసీఆర్‌ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామ లాగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారాన్ని తగ్గిస్తున్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. సిఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు,కేవలం కెసిఆర్ సర్కార్ మాత్రమే అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం,కేసిఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెళ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా నిలిచారు మంత్రి కొనియాడారు.

- Advertisement -