స్ధానిక ఎమ్మెల్సీ…ముగ్గురు ఏకగ్రీవం

19
kavitha

స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల నామినేషన్ పరిశీలన ముగిసింది. 12 స్ధానాలకు గాను మూడు స్ధానాలు ఏకగ్రీవం కాగా మిగితా స్ధానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించనున్నారు. ఏకగ్రీవంగా గెలిచిన వారిలో నిజామాబాద్ నుండి కవిత, రంగారెడ్డి నుండి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు.

మిగిలిన 9 స్ధానాలను గాను 73 మంది బరిలో ఉండగా అత్యధికంగా కరీంనగర్‌లో 24 మంది ఉండగా తర్వాత ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక అత్యల్పంగా వరంగల్‌ నుండి ముగ్గురు ఎన్నికల బరిలో ఉన్నారు.

డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికలు జరుగుతున్న 9 స్థానాల్లో 7,792 మంది ఓ టర్లు ఉన్నారు. వీరిలో 90 శాతానికిపైగా టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైనవారే.