అల్లరి మూకల ఆటకట్టిస్తాం: హోంమంత్రి

50
ali

భైంసాలో అల్లరిమూకల ఆటకట్టించేందుకు అవసరమైనంత భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు హోంమంత్రి మహమూద్ అలీ. ప్రస్తుతం భైంసాలో పరిస్ధితి అదుపులోనే ఉందని… ఘర్షణలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నామని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని…శాంతిభద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు అలీ.

భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ.. ఘర్షణకు దారితీయడంతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈఘర్షణలో వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఈ ఘర్షణల్లో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది గాయపడ్డారు.