మ‌నిషిని వెంటాడే క‌థ‌లు ఇవి- మంత్రి కేటీఆర్

286
ktr
- Advertisement -

రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ నిత్యం ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌తో బిజీగా గడుపుతుంటారని అందరికీ తెలిసిందే.. వీటితోపాటు ఆయన అప్పుడ‌ప్పుడు సినిమాలు, పుస్త‌కాలు చ‌దువుతుంటారు. అలా ఇటీవ‌లే కేటీఆర్ ఓ మంచి పుస్తకాన్ని చదివి తన అనుభావాన్ని పంచుకున్నారు.. ‘గుండెలో వాన అనే క‌థ‌ల పుస్త‌కాన్ని చ‌దివినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘గుండెలో వాన’ పుస్తకంలో కొన్ని కథలు చదివాను. నిజంగా కదిలిపోయాను. మనిషిని వెంటాడే కథలు ఇవి. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్టు రాసారు పెద్దింటి అశోక్ కుమార్. రెండు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి. పెద్దింటి అశోక్ కుమార్‌కి అభినందనలు అంటు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -