‘డియర్ మేఘ’ నుండి లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్‌..

203
- Advertisement -

హీరోయిన్‌ మేఘ ఆకాశ్ ప్రధాన పాత్రధారిగా ‘డియర్ మేఘ’ రూపొందింది. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అర్జున్ దాస్యం నిర్మాతగా వ్యవహరించాడు. మేఘ ఆకాశ్ జోడీగా అరుణ్ ఆదిత్ .. అర్జున్ సోమయాజుల నటించారు. ‘డియర్ మేఘ’ నుంచి ఇప్పకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్, ‘ఆమని ఉంటే పక్కన’ అనే లిరికల్ సాంగ్ వచ్చి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ వీడియోను యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్ విడుదల చేశారు.’ గుండెల్లో కన్నీటి మేఘం .. కమ్మిందా తానైతే దూరం’ అంటూ ఈ పాట సాగుతోంది. చెలికాడు దూరమైనా సమయంలో .. సందర్భంలో నాయికగా మనోవేదనగా ఈ పాట తెరపై ఆవిష్కృతమవుతుందని అర్థమవుతోంది. హరి గౌర సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యానికి హరిణి గానం ప్రాణం పోసిందనే చెప్పాలి.

- Advertisement -