సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి కేటీఆర్‌..

33
minister ktr

దసరా నాటికి ముఖ్యమంత్రి వచ్చే సమయానికి అన్నిరకాల సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చొరవ చూపాలని ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటించారు. ఇందులో భాగంగా తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలో డబల్ బెడ్‌రూం, ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ స్కూల్, ఇందిరమ్మ కాలనీ బైపాస్ రోడ్డులను పరిశీలించారు. వీటికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత డిఈ లకు ఆదేశించారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ సందర్శించారు. అదేవిధంగా సిరిసిల్లలోని డబల్ బెడ్ రూం నిర్మాణ పనులను పరిశీలిస్తూ సరియైన విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని.. ఇండ్ల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని మొక్కలు నాటాలని ఆదేశించారు. దీనిని ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో మోడల్ డబల్ బెడ్ రూంలు నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు

తదనంతరం నూతనంగా నిర్మిస్తున్న సమీకృతా కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి కలెక్టరేట్ ఆవరణలో ప్లాంటేషన్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభనికి సిద్ధం చేయాలని సంబంధించిన అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌సి పిన్స్ పల్ సెక్రెటరీ అరవింద కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్, ఆర్ డి ఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.