ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ..

260
minister sabita reddy
- Advertisement -

కరోనాతో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్ట్ 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనుండగా.. ఆగస్ట్ నెలలోనే అన్ని రకాల పరీక్షలు పూర్తి కానున్నాయి. మరోవైపు జూలై నెల్లోనే డిగ్రీ,పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ విసి లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

ఈమేరకు రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్ సెట్ ( ఇంజనీరింగ్ ) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎమ్ సెట్ ( అగ్రికల్చర్, మెడికల్ ) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కోవిడ్ -19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించినందున ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

ఎంసెట్ తో పాటు మిగతా 7 రకాల సెట్ పరీక్షల షెడ్యూల్ సైతం విడుదలయ్యింది. ఆగస్ట్ 3న ఈసెట్, ఆగస్ట్ 11 నుంచి 14 వరకు పీజీ ఈసెట్, 19 నుంచి 20 వరకు ఐసెట్, ఆగస్ట్ 23న లాసెట్, 24-25 తేదీల్లో లాసెట్, జూలై 17న పాలిసెట్ పరీక్షలు జరగబోతున్నాయి.ఫైనల్ ఇయర్ పరీక్షలను జులైలో పూర్తి చేయాలి. ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జులై మొదటి వారం నుంచి ప్రారంభించి మాసాంతం లోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను మంత్రి ఆదేశించారు.

విదేశాల్లోనూ, ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల బ్యాక్ లాగ్లు కూడా జూలై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలను కోవిడ్ 19 నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ..

– ఆగస్ట్ 4 నుంచి 10 వరకు ఎంసెట్
– 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు
– 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు
– ఆగస్ట్ 3న ఈసెట్
– 11 నుంచి 14 వరకు పీజీ సెట్.
– ఆగస్ట్ 19 మరియు 20 తేదీల్లో ఐ సెట్
– ఆగస్ట్ 23 న లాసెట్
– ఆగస్ట్ 24 ,25 తేదీల్లో ఎడ్ సెట్.
– జూలై 17 పాలీసెట్
– ఇంజనీరింగ్,డిగ్రీ ,పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జూలై మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయి

- Advertisement -