యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌..

41
kcr

సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రికి యాదాద్రిని సందర్శించారు. బాలాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పునః నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. బెంగుళూర్‌కు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ ఆలయానికి ఏర్పాటు చేసిన మెలి వర్ణపు విద్యుత్ దీపాలను.. అలాగే ఇండోర్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన ఇత్తడి క్యూ లైన్ లను సీఎం కేసీఆర్ పరిశీలించారు.

భారీ బడ్జెట్‌తో యాదాద్రి అభివృద్ధి పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆలయాన్ని అత్యంత సుందరంగా పునర్నిర్మిస్తున్నారు. ఈ ఆలయ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాదాద్రిని సందర్శించి.. పనులను పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలను ఇచ్చారు. ఈరోజు వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన యాదాద్రికి బయల్దేరారు.

సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత,సీఎస్‌ సోమేశ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు.