కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని పరిశీలించిన మంత్రి కేటీఆర్..

160
ktr
- Advertisement -

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధునాతన టెక్నాల‌జీతో హైదరాబాద్, బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిని పరిశీలించారు మంత్రి కేటీఆర్. మంత్రులు మహమూద్ అలీ,పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 7 ఎకరాల విస్తీర్ణంలో, 17 అంతస్తులు,5లక్షల చదరపు అడుగుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఈ సెంటర్ నుంచి హైదరాబాద్ లోని అణువణువునూ చూడవచ్చు.

అత్యాధునిక నేరపరిశోధన విభాగాలు, సమాచార వ్యవస్థ తో పాటు అనేక పరిశోధనావిభాగాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానమై నేరాల అదుపు, పరిశోధన వేగవంతంచేసే వ్యవస్థ ఏర్పకానుంది. కదలికలను పసికట్టి ముందస్తు చర్యలు తీసుకునే వ్యవస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం విశేషం.

- Advertisement -