ఆసీస్‌ టూర్‌లో కోహ్లీ రికార్డులు బ్రేక్ చేస్తాడా!

69
kohli

మరికొద్దిరోజుల్లో భారత్- ఆసీస్ మధ్య టెస్టు,వన్డే,టీ 20 సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆసీస్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నం కాగా టీమిండియా సారధి కోహ్లీని రికార్డులు ఊరిస్తున్నాయి.

క్రికెట్ చరిత్రలో 100 శతకాలు చేసి ఎవరికి అందని ఎత్తులో సచిన్ ఉండగా తర్వాత స్ధానంలో 71 సెంచరీలతో రెండో స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు.

కోహ్లీ ఇప్పటివరకు వన్డేలో 43, టెస్టులో 27 శతకాలతో మొత్తం 70 సెంచరీలు చేసి మూడో స్ధానంలో ఉండగా మరో రెండు సెంచరీలు చేస్తే పాంటింగ్ రికార్డును చెరిపేసి రెండో స్ధానానికి చేరుకోనున్నాడు. ఈ పర్యటనలో కోహ్లీ ఒక్క సెంచరీ చేసినా ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. మరి ఆసీస్ పర్యటనలో కోహ్లీ సెంచరీలతో రాణించి రికార్డులు బ్రేక్ చేస్తాడా లేదా వేచిచూడాలి.