ఆదిలాబాద్‌కు మంత్రి కేటీఆర్..

116
ktra
- Advertisement -

ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు చేరుకోనున్న కేటీఆర్…మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇటీవలె రామన్న మాతృమూర్తి మరణించిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుని… బీడీఎన్‌టీ ల్యాబ్స్‌, ఎన్‌టీటీ డాటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఐటీ టవర్స్‌ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరి ఒంటి గంటకు నిర్మల్‌ జిల్లా బాసర చేరుకుంటారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో భేటీ అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. 3 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరనున్నారు.

- Advertisement -