మంత్రి సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్‌ పరామర్శ..

112
- Advertisement -

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తండ్రి లింగ్యా నాయక్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మహబూబాబాద్‌ జిల్లా పెద్దతండాని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం లింగ్యా నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్యెల్యు,ఎంపీలు, ఎమ్మెల్సీలు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -