వలస కూలీల క్యాంపులను సందర్శించిన కేటీఆర్..

500
minister ktr
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని వలసకూలీల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వారు ఉన్న పలు ప్రాంతాలకి పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు వలస కూలీలతో మాట్లాడి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.గచ్చిబౌలిలోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ సైట్లో పని చేసేందుకు వచ్చిన సుమారు 400 మంది ఉన్న క్యాంపుని మంత్రి ఈ సందర్భంగా సందర్శించారు. ఈ క్యాంప్‌లో ఒరిస్సా, బెంగాల్, బీహార్ పలు రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉన్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా మంత్రి వెంట ఉన్నారు.

ktr 2

ప్రస్తుతం లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో అందరూ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రస్తుతం పనులు లేనందున వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న ఆహారం, రేషన్ సరుకుల గురించి ప్రత్యేకంగా వాకబు చేశారు. లాక్ డౌన్ సమయంలో ఏవిధంగా గడుపుతున్నారు పలువురుతో మాట్లాడి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని కాపాడు కోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచించారు. త్వరలోనే కరోనా మహమ్మారి సంక్షోభం తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి అప్పటివరకు బయటికి వెళ్లకుండా వారికి ఏర్పాటు చేసిన వసతిలోనే ఉండాలని కోరారు.

ktr 1

ఈ సందర్భంగా వలస కూలీలు ఉంటున్న వసతి ప్రాంతాల్లో (షెడ్డులో) తిరిగిన మంత్రి వారి పేరు, ఎక్కడి నుంచి వచ్చారు వంటి వివరాలు అడిగారు. పని లేనందున సొంత ప్రాంతాలకు పోవాలని ఉన్నదా లేదా ఇక్కడ అంతా బాగానే నడుస్తుందా అంటూ వారితో మాట్లాడారు. వారి కుటుంబాల యొక్క బాగోగులను సైతం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తమ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని ఇక్కడ క్షేమంగానే ఉన్నామని మంత్రి కేటీఆర్ కి వలస కూలీలు పలువురు తెలియజేశారు. వలస కూలీలను ఈ రెండు వారాల పాటు వారికి కనీస అవసరాలను తీరుస్తూ జాగ్రత్తగా చూసుకోవాలని కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో పాటు స్థానిక అధికారులను మంత్రి కేటీఆర్ సూచించారు.

- Advertisement -