సీవరేజ్ ట్రీట్‌మెంట్‌ సిటీగా హైదరాబాద్‌..

117
- Advertisement -

దేశంలోనే తొలి వందశాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ సిటీగా హైదరాబాద్ అవతరించబోతుందన్నారు మంత్రి కేటీఆర్. ఎస్సార్‌డీపీలో భాగంగా హైదరాబాద్‌ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం కల్పతరువు వంటిందన్నారు. అందరికీ ఉపాధి ఇస్తుండటంతో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత వరదలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాటజిక్‌ నాలా కార్యక్రమం చేపట్టామన్నారు. మార్చి, ఏప్రిల్‌ నాటికి స్ట్రాటజిక్‌ నాలా కార్యక్రమం పూర్తిచేస్తామన్నారు.

వంద శాతం సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం 31 ఎస్టీపీలను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తిచేశామన్నారు. మరో 11 ప్రాజెక్టులను ఈ ఏడాది పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే మూడేండ్లలో నగరానికి 3,500 ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకురానున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -