ఈ చిన్నారి టాలెంట్‌కు మంత్రి కేటీఆర్‌ ఫిదా..

133
ktr
- Advertisement -

ఈ బుడతడు చూడండి ఇంత చిన్ని వయసులో ఎలా చెలరేగిపోతున్నాడో..! నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ను ఓ ఆటాడేస్తున్నాడు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. కలకత్తాకు చెందిన ఆ చోటా క్రికెటర్ గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. కలకత్తా లోని బెహాళ ప్రాంతం పరిధిలోని ముచిపరాలో షేక్ షాహిద్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఉన్నాడు. ఈ బుల్లి క్రికెటర్‌ ఎంచక్కా బ్యాట్ చేతపట్టుకుని బాల్ ను బౌండరీలు దాటిస్తున్నాడు. స్టార్ క్రికెటర్లు అంతా ఆ బుడ్డోడు క్రికెట్ ఆడుతున్న తీరుకు ఫిదా అవుతున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వ్యగాన్ అయితే ఏకంగా ఆ బుడ్డోడిని కలిసి సెల్ఫీ కూడా దిగారు. విరాట్ కొహ్లీ కూడా ఆ చోటా క్రికెటర్ వీడియోను షేర్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఈ బుడతడి వీడియో చూసి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

డైపర్ నుంచి నాలుగేళ్ల వయసుకు వచ్చేశాడు. దేశానికి ఘన విజయం సాధించి పెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.. అంటూ షేక్ షాహిద్ ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీన్ని కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. దీంతో కేటీఆర్ ఆ వీడియోకు స్పందించారు. అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగిన ఈ బుడ్డోడి గురించి మీరేమంటారు వీవీఎస్ లక్ష్మణ్, హర్ష భోగ్లే..‘ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

- Advertisement -