మా సిద్ధా సర్వం సిద్ధం..

243
ramcharan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ మెగా పవర్‌ స్టార్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి రామ్ చ‌ర‌ణ్ తేజ్ కు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది. రామ్ చరణ్ ఎన్న‌డూ లేని విధంగా కొత్త లుక్‌లో మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో క‌న‌ప‌డుతున్నాడు.

సిద్ధా అనే పాత్రలో ఆయ‌న న‌టిస్తున్నాడ‌ని ఈ సినిమా బృందం తెలిపింది. ‘ఆచార్య’ సెట్‌లోకి ఆయ‌న‌కు స్వాగతం పలుకుతున్నామ‌ని చెప్పింది. “మా సిద్ధా సర్వం సిద్ధం” అంటూ ఈ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఈ పోస్ట‌ర్ ను పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ న‌టిస్తోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమాను మే 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

https://twitter.com/sivakoratala/status/1350661983444471809
- Advertisement -