KTR:వరంగల్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

73
- Advertisement -

దక్షిణ కొరియాకు చెందిన యంగవన్‌ కంపనీ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఎవర్ టాప్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. వరంగల్‌ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ చేతులమీదుగా యంగ్‌వన్ కంపనీ భూమిపూజ చేయనున్నారు.

అనంతరం మంత్రి కంపెనీ ప్రతినిధులు పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. టీఎస్‌ఐఐసీ టెక్స్‌టైల్‌ పార్కులో యంగవన్ కంపెనీకి ఇటీవల ప్రభుత్వం 298ఎకరాలను కేటాయించింది. దీని ద్వరా 11700మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం లభించనుంది. అలాగే పరోక్షంగా 11700మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ అధికారులు భావిస్తున్నారు. యంగ్‌వన్ కంపెనీ ఈ టెక్స్‌టైల్‌ పార్కులో రూ.840కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

Also Read: Germany:కాంస్యయుగం నాటి ఖడ్గం లభ్యం

మంత్రి కేటీఆర్ ఖిల్లావరంగల్‌కు వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో చేపట్టిన 16 స్మార్టు రోడ్లను కేటీఆర్‌ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్‌ మోడల్‌ బస్‌స్టేషన్‌, రూ.313 కోట్లతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆజంజాహీ మిల్స్‌ గ్రౌండ్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆజంజాహీ మిల్స్‌ గ్రౌండ్‌లో జరుగనున్న బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు.

Also Read: రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

- Advertisement -