ఎన్నికలు సమీపిస్తున్నాయని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కేటీఆర్.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాప చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..పార్టీ కార్యాలయం రోజు నాయకులు కార్యకర్తలతో కలకలాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం చేయాలని ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చడం జరిగిందన్నారు. పేరు మారింది కానీ జెండా, ఎజెండా మారలేదన్నారు . అనంతరం కార్యాలయంలో మొక్కలు మొక్కలు నాటారు.జిల్లా కేంద్రంలోని వేశాలపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ముందుగా కోటీ 20 లక్షల రూపాయలతో నిర్మించిన గణపురం తహసీల్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గణపురం మండలంగాంధీ నగర్ లో రూ. 4 కోట్ల నిధుల తో నిర్మించిన నూతన మహాత్మా జ్యోతి బా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలనుప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..