ఖమ్మం ఐటీ హబ్‌కు శ్రీకారం

176
khammam
- Advertisement -

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఖమ్మం ఐటీ హబ్‌కు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు మంత్రి కేటీఆర్. దాదాపు 5 అంతస్తుల్లో రూ. 27 కోట్లతో నిర్మించిన ఈ ఐటీ హబ్‌ను మంత్రి పువ్వాడతో కలిసి ప్రారంభించనున్నారు కేటీఆర్. దాదాపు వెయ్యి మందికి దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించనుండగా 16 కంపెనీలు పనిచేయనున్నాయి.

దాదాపు 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించారు. రెండేండ్లలోనే దీన్ని పూర్తి చేయడం విశేషం. ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన కంపెనీలు కావడం మరో విశేషం. ప్రస్తుతం 430 మందిని నియమించుకున్నారు. త్వరలో మరో 430 మందిని నియమించుకోనున్నారు. దీంతో రెండు షిప్టుల్లో 860 మంది పనిచేయనున్నారు.

ఖమ్మం ఐటీ టర్నోవర్‌ 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐటీ రంగం విస్తరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి.

- Advertisement -