గ్రేటర్ రోడ్ల అభివృద్ధికి చర్యలు..

216
Minister KTR Speech on Hyderabad Roads
- Advertisement -

హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ పనుల ద్వారా రోడ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రోడ్ల నాణ్యతపైదృష్టి సారిస్తున్నామని చెప్పారు. 52 పనులకు అనుమతులిస్తే 18 పనులు శరవేగంగా ముందుకు పోతున్నాయని చెప్పారు. మున్సిపల్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లతో కలిసి పని చేస్తేనే పనుల్లో పురోగతి సాధ్యమవుతుందన్నారు.

ప్యారడైస్ నుంచి కొంపల్లి, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు రోడ్డు పనుల విషయంలో కేంద్ర రక్షణ శాఖతో మాట్లాడుతున్నామని తెలిపారు. రక్షణ శాఖ ఇబ్బందుల వల్ల రహదారుల పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. వంద ఎకరాల స్థలానికి 600 ఎకరాల స్థలం ఇస్తామని కూడా చెప్పినట్లు మంత్రి తెలిపారు.

మియాపూర్ – బాచుపల్లి రోడ్డు విషయంలో ఆర్ అండ్ బీ మంత్రి, అధికారులతో చర్చించి పరిష్కారిస్తామన్నారు. ప్రగతి నగర్ రోడ్డు విషయంలో ఇబ్బంది ఉంది. ఒక వైపు చెరువు ఉంది. మరోవైపు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఇబ్బందులున్న కారణంగా అక్కడ ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు.హెచ్‌ఎండీఏ వద్ద రహదారుల కోసం రూ. 2500 కోట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. రోడ్ల విషయంలో నాణ్యత పాటిస్తున్నామని చెప్పారు. ఫతేనగర్ అండర్‌పాస్ విషయంలో రైల్వే, ఆర్ అండ్ బీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉషా ముళ్లపూడి రోడ్డు విస్తరణకు భూసేకరణ పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -