తలసరి విద్యుత్‌లో తెలంగాణ ముందుంది: కేటీఆర్‌

151
ktr minister
- Advertisement -

గురువారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్‌ సమస్య లేదన్నారు. భవిష్యత్తులో ఇక కరెంట్‌ పోదని ఖచ్చితంగా చెప్పగలమన్నారు. గతంలో అన్ని రంగాలకు కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉండేదన్న కేటీఆర్‌.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వీటన్నింటిని అధిగమించి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ ఉద్యోగుల కృషితో రాష్ట్రంలో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని 16 వేలకు పెంచగలిగినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేటీఆర్‌ అన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దేశంలో పరిశ్రమలకు సరిపడా కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే మాత్రమేనన్నారు. అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడా లోటులేకుండా ప్రతిరంగానికి సీఎం కేసీఆర్‌ న్యాయం చేశారన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రతి రంగాన్ని ఎక్కడ లోటు లేకుండా న్యాయం చేశారు సీఎం కేసీఆర్. అయితే ఇవాళ కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకరు టీపీసీసీ, ఒక టీ బీజేపీ అని.. వారికి పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని కేటీఆర్‌ అన్నారు.తెలంగాణ తీసుకొచ్చింది సీఎం కేసీఆర్. ఇలాంటి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలిన ఇష్టానుసారంగా మాట్లాడిన వారిని మీరు తప్పక తిప్పికొట్టాలి.రాష్ట్ర సాధనకు మీరు ఏ విధంగా ఉద్యమం చేశారో అలాగే వీటిని కూడా తిప్పికొట్టాలి అని మంత్రి కేటీఆర్ ఉద్యోగులను కోరారు.

- Advertisement -