మొక్కల పెంపకమే భవిష్యత్‌ తరాలకు ఆస్తి..

129
minister harish
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో తెలంగాణలో 5 ఎండ్లలో 3.67 శాతం అడవుల పెంపకం పెరిగింది. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవనంలో గజ్వేల్ నుంచే ప్రారంభం అయ్యిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట శివారులో నిర్మితమైన ‘తేజోవనం అర్బన్‌ ఫారెస్టు పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. మొక్కల పెంపకంను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. మానసిక ఒత్తిడి నీ దూరం చేయడం, ఆరోగ్యం పెంపొందించడంలో మొక్కల ది కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గ్రీన్ కవర్ పెరిగితేనే ప్రజలకు స్వచ్చమైన గాలి అందుతుంది. మొక్కల పెంపకమే..భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తి అన్నారు మంత్రి.

సిద్దిపేట ప్రజలకు తేజోవనం పార్క్ ఎంతో ఉపయోగ పడుతుంది. వన భోజనాలు, చిన్న చిన్న ఫంక్షన్లు ఇక్కడ చేసుకోవచ్చు..ప్రజలు దీనిని ఉపయోగించు కోవాలి.అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు ఈ పార్కులో ఉన్నాయి.త్వరలో మూషికా జింకలను ఈ పార్కులో ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలు ఆడుకునేక ఇతర స్పోర్ట్స్ సౌకర్యాలు కల్పిస్తాం..500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని సుమారు 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. యాంత్రికంగా మారిన మనిషి అనేక ఒత్తిళ్లకు లోనై అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆక్సిజన్ పార్కు లు మనిషి ఒత్తిడిని తగ్గించి ఆరోగ్య వంతుణ్ణి చేస్తాయని మంత్రి తెలిపారరు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అర్బన్ పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 10 శాతం బడ్జెట్‌ను హరిత తెలంగాణ కోసం వినియోగిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా అడవుల పెంపకంపై దృష్టి పెట్టడం లేదని. దేశంలో అన్ని ప్రాంతాల్లో అడవులు తగ్గిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో అటవీప్రాంతం అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఇది సీఎం కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమవుతోంది అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -