మొక్కలు నాటిన ‘కార్తీక దీపం’ ఫేమ్ బేబీ కృత్తిక

472
Baby Krithika
- Advertisement -

ఈ రోజు కార్తీక దీపం సీరియల్ ఫేమ్ బేబీ కృత్తిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని కార్తీక దీపం సీరియల్ ఫేమ్ బేబీ కృత్తిక తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఆర్టిస్ట్ ప్రత్యూష విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ కార్తీక దీపం సౌర్య ఫేమ్ బేబీ క్రిత్తిక నార్సింగ్‌లోని మంచిరేవులలో మొక్కలు నాటింది. అనంతరం మరో ముగ్గురు ( కార్తీక దీపం వంటలక్క ఫేమ్ ( ప్రేమి విశ్వనాథ్ ) , కార్తీక దీపం డాక్టర్ బాబు ఫేమ్ ( నిరూపమ్ ) , ప్రొడ్యూసర్ వెంకటేశ్వర రావు ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని బేబీ కృత్తిక కోరారు.

- Advertisement -