తెలంగాణ ముక్కోటి టన్నుల ధాన్యాగారం..

20
ktr

నాడు దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు…నేడు తెలంగాణ ముక్కోటి టన్నుల ధాన్యగారంగా మారిందని తెలిపారు మంత్రి కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్…. రాష్ట్రంలో ఎకరా భూమి విలువ పది నుంచి పదిహేను లక్షలు పలుకుతోందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి అమ్ముతామంటే కొనేవారు దిక్కులేరని.. ఇప్పుడు భూమి కొందామంటే.. అమ్మేవారు లేరని ఆయన పేర్కొన్నారు.

భూగర్భ జలాల సంరక్షణలో తెలంగాణ ఆదర్శప్రాయంగా ఉందన్నారు. తెలంగాణలో నేడు పచ్చని పొలాలు…పంటలు ఉన్నాయని అన్నారు. పాలమూరుకు ఇప్పుడు వలస పోయిన కార్మికులు వెనక్కి వస్తున్నారన్నారు. తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.