బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌనదీక్ష..

21

పంజాబ్ లో మోదీ కాన్వాయ్ ని అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ మౌనదీక్షలు చేపడుతు నిరసనలు తెలుపుతోంది. ఈ మేరకు తెలంగాణలోని ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌనదీక్షలో కూర్చున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11గంల నుంచి 2గంటల వరకు అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌనదీక్ష నిర్వహించారు. అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు బండి సంజయ్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షులు, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా సీనియర్ నేత ఎంతైనా బిజెపి శీను ,హరిబాబు, బాణాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.