రాష్ట్రానికి పెట్టుబుదారులే బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు మంత్రి కేటీఆర్. శంషాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. ఆవిష్కరణల కోసం టీ హబ్ వంటి ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు శాఫ్రాన్ నిర్ణయించిందని తెలిపారు. హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని చెప్పారు. ప్రపంచస్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు. శాఫ్రాన్ నిర్ణయం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.