ఓట్ల కోసం మందు పోయను…పైసలు పంచనని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో బీసీ బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు మంత్రి కేటీఆర్. అట్టడుగు వర్గాల పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని…. శతాబ్దాలుగా అత్యంత అట్టడుగున ఉన్నది దళితులు. దళితుల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం అన్నారు.
బీసీ, ఎంబీసీల్లోని 14 కులవృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష సాయం అందిస్తున్నాం అని…. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెలలో 600 మంది లబ్దిదారులకు రూ. లక్ష చొప్పున సాయం చేసినట్లు తెలిపారు.
పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు కాపాడుకోవాలని…తానెప్పుడు ఓట్ల కోసం మందు పోయించి…పైసలు పంచలేదని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు.
Also Read:బ్యాంక్ సేవలన్నీ ఇకపై వాట్సాప్ లోనే..?
ప్రజలందరికీ అండగా ఉండే బాధ్యత నాదని…. కేసీఆర్ సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రానికి డోకా లేదన్నారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 10 వేల మందికి లక్ష సాయం తప్పకుండా అందించి తీరుతాం అని…. దళితులు, బీసీలకు అందిస్తున్న మాదిరిగానే మైనార్టీలకు కూడా రూ. లక్ష ఆర్థిక సాయం త్వరలోనే అందజేస్తామన్నారు.పేదల మీద కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఇతరులకు ఎవ్వరికీ లేదని…. ప్రతి పథకం లబ్దిదారులకు నేరుగా అందుతుందన్నారు.
Also Read:కేంద్రంలో కేసిఆర్ టార్గెట్.. ఫిక్స్?