ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్

190
ktr
- Advertisement -

ఆరేళ్లుగా హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. హోటల్ మారియట్‌లో హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించగా కరోనా సమయంలో వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు నిలిచాయని చెప్పారు కేటీఆర్. లాక్ డౌన్ కాలానికి 6 నెలల కరెంట్ ఛార్జీలు రద్దు చేశామని వెల్లడించారు. హైదరాబాద్‌ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా నిలవబోతుందన్నారు.

కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారని చెప్పారు. కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఎంత మంది లాభపడ్డారో చెప్పాలన్నారు.కరోనా ప్రపంచంలో ఎవరినీ వదలలేదు….అందరికి నష్టం చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో చిన్మ,సూక్ష్మ తరహా పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయని తెలిపారు.

లాక్‌డౌన్‌కు ముందు 8 త్రైమాసికాల్లో దేశ ఆర్ధిక పరిస్ధితి దిగజారుతూ వచ్చిందన్నారు. మేం అధికారంలోకి రాకముందు ఇందిరా పార్కు ముందు పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసే పరిస్ధితి ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి మారిందన్నారు. మౌలిక సదుపాయాలు బాగుంటే నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నగరం నలువైపులా పరిశ్రమలు విస్తరించాయని తెలిపారు. ఐటీ పరిశ్రమలను కూడా నగరం నలువైపులా విస్తరిస్తున్నామని చెప్పారు.

అమెజాన్‌ రూ.21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.

- Advertisement -