లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్- మంత్రి కేటీఆర్‌

73
ktr minister
- Advertisement -

సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ఆర్ అండ్‌ డీ, ఇన్నోవేషన్‌ హాటస్పాట్‌ ఆఫ్‌ ఏషియా అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు డాక్టర్ రెడ్డీస్ చెందిన జివి. ప్రసాద్ రెడ్డి, పీడబ్య్లూసీ కి చెందిన మహ్మమద్ అథర్ లు ఈ ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగింది అన్నారు. ఈ రంగానికి ఉతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారత దేశంలో కొంత తక్కువమద్దతు ఉందని భావిస్తున్న.. ప్రపంచ స్థాయి పోటీలో తట్టుకుని నిలబడాలంటే భారత లైసెన్స్ బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలకు అవసరం. ఇప్పటికే హైదరాబాద్ నగరం లైఫ్ సైన్స్ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటుంది అన్నారు.

లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ నగరం ఉన్నది. దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నాం.. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు కేటీఆర్‌.

భవిష్యత్తులో లైసెన్స్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్‌లో ఇతర నగరాలకంటే ముందున్నది. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్ సైన్సెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఐటి మరియు ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ అతిపెద్ద రెండవ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కలిగి ఉందన్నారు.

భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలి. ఎందుకంటే ఈ రంగంలో ఇన్నోవేషన్ పైన పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్ తో కూడుకున్నవి, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలి, ఈ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నదని తెలిపారు.

కనీసం రానున్న దశాబ్ద కాలం పాటు భారత లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న కేవలం మందుల తయారీ పై మాత్రమే కాకుండా నూతన మాలిక్యుళ్లను తయారు చేసే దిశగా కృషి చేస్తే బాగుంటుంది. భారతదేశంలో నైపుణ్యానికి కొదవలేదు. ప్రభుత్వాలు లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి ఇన్నోవేషన్ కి ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశధకులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తున్నదిని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -