బాలానగర్ ప్రజల కల నెరవేరింది: కేటీఆర్

266
ktr minister
- Advertisement -

హైదరాబాద్ బాలానగర్ ప్రజల 40 సంవత్సరాల కల నెరవేరిందన్నారు మంత్రి కేటీఆర్. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు దాదాపు. 385 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ను మంత్రులు మల్లారెడ్డి, తలసానితో కలిసి ప్రారంభించిన కేటీఆర్…. ఈ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్‌ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఎస్ఆర్డీపీ ( వ్యూహాత్మ‌క రోడ్ల అభివృద్ది ప్ర‌ణాళిక‌) ద్వారా.. ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు నిర్మిస్తున్నాం. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రూ. వెయ్యి కోట్ల పై చిలుకు డ‌బ్బుల‌తో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల నిర్మాణం జ‌రిగిందన్నారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌తో బాలాన‌గ‌ర్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు… ఈ ర‌హ‌దారి గుండా వెళ్లేవారికి క‌నీసం 30 నిమిషాల‌పాటు ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డంతో ట్రాఫిక్ క‌ష్టాలు పూర్తిగా తొల‌గిపోయాయని వెల్లడించారు.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సంయుక్తంగా క‌లిసి బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా రహదారుల నిర్మాణం చేపడతామన్నారు కేటీఆర్. ప్యాట్నీ నుంచి సుచిత్ర వ‌ర‌కు, జూబ్లీ బ‌స్టాండ్ నుంచి తుర్క‌ప‌ల్లి(ఓఆర్ఆర్) దాకా స్కైవేలు నిర్మించేందుకు గ‌త నాలుగేండ్ల నుంచి క‌స‌రత్తు జ‌రుగుతోందని అయితే కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయ‌క నిరాక‌ర‌ణ వ‌ల్ల ఆ ప‌నులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.

- Advertisement -