గులాబీతో..ఎన్ని ప్రయోజనాలో!

65
- Advertisement -

గులాబీ పువ్వు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో అందరికీ తెలిసిందే. చక్కటి సువాసనలను వెదజల్లుతూ మనసును ఆహ్లాద పరుస్తుంది. అందుకే పువ్వుల్లో గులాబీని రారాజు లా పోలుస్తారు. గులాబీ పువ్వును ఆడవాళ్ళు అలంకరణ ప్రాయంగా వాడుతుంటారు. కాగా గులాబీ పువ్వు ఎంత అందంగా కనిపిస్తుందో.. అంతకు మించి ఔషధ గుణాలు అందులో ఉన్నాయనే సంగతి మీకు తెలుసా ? అవునండీ.. గులాబీ పువ్వు ఎన్నో ఔషధ గుణాల సమ్మేళనం. ఆయుర్వేదంలోనూ, మెడిసన్ తయారీలోనూ గులాబీని వాడుతుంటారు.

గులాబీపువ్వు ఎన్నో రుగ్మతలను దూరం చేస్తుంది. ఇందులో మలిక్ యాసిడ్, టానిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటినుంచి తైలలు ఎన్నో చర్మ వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా పలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా గులాబీ ఎంతగానో ఉపయోగ పడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ రెండు గ్రాముల చొప్పున గులాబీ రసం తీసుకుంటే పిత్తాశయంలో వచ్చే వికారం తగ్గుతుందట. ఇక గులాబీ రేకులను ప్రతీరోజు భోజనం తరువాత రెండు లేదా మూడు గులాబీ రేకులను నమిలితే జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది.

ఇక శరీరంపై చీము పట్టిన పుండ్లపై గులాబీ పొడి చల్లితే యాంటీ బయోటిక్ లా కూడా పని చేస్తుంది. చాలమందికి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది.. అలాంటి వాళ్ళు కొన్ని రోజులపాటు గులాబీ రేకుల రసాన్ని శరీరానికి మర్దన చేస్తే.. శరీరం నుంచి వచ్చే దుర్గంధం తగ్గుతుంది. వీటన్నిటికి మించి సౌందర్య సాధనలో గులాబీ చేసే ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. అనేక రకాల సౌందర్య సాధనల్లో గులాబీని విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాగే బాడీ స్ప్రే, పర్ఫ్యూమ్ వంటి సువాసన వెదజల్లే కరకాలలో గులాబీ వాడకం అధికం. అందుకేనేమో గులాబీ అటు రాజసానికి, ఇటు చర్మసౌందర్యానికి సూచికగా నిలిచింది.

 Also Read:పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులు  

- Advertisement -