గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలోని 3వ వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. వార్డులో చేపట్టే సిసి రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతనం ఆర్డీవో కాంప్లెక్స్ లో కోవిడ్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల్యాబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ : ఒకవైపు పవర్లూం, చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. కేంద్రం ప్రభుత్వం ఏడున్నార సంవత్సరాలుగా అండగా నిలబడండని కోరుతున్నా పట్టించుకోవట్లేదు. సిరిసిల్ల కు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి అడిగినా మొండిచేయి చూపిస్తున్నారు. పవర్లూం క్లస్టర్ లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీలు అడిగినా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ దయ్యబట్టారు.
రాష్ట్రానికి జరుగుతున్న నష్టం కోసం పోరాడితే పోయేది ఏం లేదు. రాష్ట్రంలోని నేతన్నలకు సహాయం చేయాలనే సోయి కేంద్రానికి లేదని మండిపడ్డారు. జిఎస్టీ వేసి నేత పరిశ్రమను దెబ్బతీయాలని కేంద్రం చూస్తుంది. తాత్కాలికంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది. బడ్జెట్లో రాష్ట్రానికి మెండిచేయి చూపింది. చేనేత కార్మికులకు మద్దతుగా మాట్లాడిన ఎల్ రమణ అన్నకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.
అన్ని అర్దర్లు ఇక్కడి చేనేత కార్మికులకె ఇస్తున్నాం. వారిని ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. వ్యవసాయం తరువాత చేనేత రంగంపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నారని ఎన్నోసార్లు చెప్పాం.. ఎనిమిదో బడ్జెట్ లో కూడా ఏమి ఇవ్వలేదు. మంత్రులను కలిసాం మోదీని కలిసినం అయినా ఏమి ఇవ్వలేదు. మనకు నష్టం జరుగుతున్నప్పుడు ఎదురు తిరగపడాల్సిందే.. తాత్కాలిక నిధులు ఇస్తామని చెప్పడం తప్ప కేంద్రం ఏమి చేయట్లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.