రాష్ట్రంలో మతం చిచ్చుపెట్టాలని ప్రయత్నాలు చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ. 495 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. కులం, మతం పేరు మీద రాజకీయం చేసే విధ్వంసకర శక్తులను, చిల్లరమల్లర వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.
కులీకుత్‌బ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం అని తెలిపిన కేటీఆర్… వారసత్వ సంపదను కాపాడుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్యను పరిష్కారిస్తామని కేటీఆర్ తెలిపారు. జీవో నం 58, 59 తెచ్చి లక్ష మందికి హైదరాబాద్‌లో పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నాం. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.