తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావు. పీవీ నరసింహారావు కూతురు అయినా ఒక్కనాడు వానిదేవిలో గర్వం కనిపించలేదని అన్నారు టీఆర్‌స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. సురభి వాణీ దేవిని హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించాలని 3 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులకు ఈ రోజు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణీ దేవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీవీకి చెడ్డపేరు తెచ్చేపని ఇన్ని సంవత్సరాలలో వానిదేవి ఎన్నడూ చేయలేదు. సురభి వానిదేవి స్వతహాగా విద్యావేత్తా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఉండాల్సిన అర్హతలన్ని వానిదేవి కి ఉన్నాయి. సురబీ వానిదేవికి ఉన్న అర్హతలు ఇతర పార్టీల్లో ఉన్న అభ్యర్థులకు ఎవ్వరికి లేవు అని కేటీఆర్ వ్యాఖ్యనించారు. 2004- 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీపీఏసీ ద్వారా 24 వేలు మాత్రమే ప్రభుత్వ రంగంలో భర్తీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు 2004- 2014 వరకు 10వేలు మాత్రమే కేటాయించారు. కానీ 1లక్ష 32వేల 799 ఉద్యోగాలు ప్రభుత్వరంగ ఉద్యోగాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం చేయని ఉద్యోగాల భర్తీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రమదోపిడి తగ్గించి అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత టీఆర్‌ఎస్ ది. నేను చెప్పిన మాటలపై చర్చకు నేను ఎక్కడైనా సిద్ధమన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు- బోర్డ్ పెట్టిన ఘనత టీఆర్‌స్ ది. ఇప్పటికే అన్ని చేసాము అని కాదు..ఇంకా చేయాల్సింది ఉందన్నారు మంత్రి. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటు అడిగే హక్కు లేదు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి?..రామచంద్రరావు స్వతహాగా లాయర్..లాయర్ల కోసం ఎం చేశారో చెప్పాలి? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్రం మాట తప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులను రద్దు చేసినందుకా ఓటు వెయ్యాలి!..దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నల్లధనం నుంచి అకౌంట్‌లో 15లక్షలు ఇస్తా అని మాట తప్పారు!..నాకు 15లక్షల రూపాయలు రాలేదు కానీ..15లక్షల తిట్లు బీజేపీ నుంచి ట్విట్టర్‌లో వచ్చాయి!. ప్రశ్నించడమే కాదు…పని చేయడం కూడా రావాలి. ఆ పని టీఆర్‌ఎస్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విభజన చిక్కులు ఇంకా విడిపోలేదు. పీఆర్సీ ఇచ్చాము కాబట్టే బల్లగుద్ది చెప్తామ్.. మళ్ళీ పక్కా ఇస్తాం.. పీఆర్సీ పై కమిటీలు- ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల తరహాలో ముసలి కన్నీళ్లు కార్చడం మాకు రాదు. వానిదేవి వ్యక్తిత్వాన్ని ప్రతిపక్షాలు సైతం ఆమోదిస్తున్నాయి.జిహెచ్ఎంసిలో టీఆర్‌ఎస్ నెంబర్ వన్ పార్టీ.. అందుకే మేయర్, డిప్యూటీ సాదించుకున్నాము. టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది అని నేను అనుకోవడం లేదు. వచ్చే శనివారం హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ప్రతి నియోజకవర్గంలో జనరల్ బాడీ సమావేశం ఉంది. జనరల్ బాడీ సమావేశం అనంతరం ఎన్నికల ప్రచారానికి టీఆర్‌స్ పార్టీ వెళ్తుందని మంత్రి కేటీర్ పేర్కొన్నారు.