మతం పేరుతో చిల్లర డ్రామాలు: కేటీఆర్

189
ktr
- Advertisement -

మతం పేరుతో చిల్లర డ్రామాలు చేయడం తమకు రాదన్నారు మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్ .. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటేనే- దేశంలో ఎక్కడా లేని ప్రథకాలు అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే తెలంగాణ కుపెట్టుబడులు- తెలంగాణ అభివృద్ధి అగుతుందా?… ప్రతిపక్షాలు చిల్లర మాటలు మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు.

ఎవ్వరిని వదిలిపెట్టం- గుడ్డలు ఉదధిస్తాం- పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్ లో నాలుగు ఇండ్లు ఎట్లా వచ్చాయి? అని ప్రశ్నించారు. అందరి భాగోతం మా దగ్గర ఉంది- అన్ని బయట పెడుతాం అన్నారు. కాంగ్రేస్ కి దమ్ము ఉంటే హుజురాబాద్ లో డిపాజిట్లు వస్తాయా?… పీసీసీ కొనుకున్నోడు- రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా? అని ప్రశ్నించారు.

రాష్ట్రం గురించి ఒక ఎంపీ మాట్లాడితే అతన్ని గాడిద అంటావా?…. దళితబంధు అనేది.1990లోనే సిద్దిపేట లో ఉంది… కాంగ్రేస్ 60 ఏళ్ల రాజకీయ పాలనలో దళితులకు దళితబంధు పథకం లాంటిది ఎప్పుడైనా పెట్టారా? అని తెలిపారు కేటీఆర్. బీసీ బంధు కావాలంటున్న బండి సంజయ్ దేశంలో ఉన్న ప్రతి బీసీలకు- బలహీన వర్గాలకు లక్షలు లక్షలు పంచాలని మోడీకి చెప్పాలన్నారు.

- Advertisement -