డ్రగ్స్‌ కేసు.. నా రక్తం- వెంట్రుకలు ఇస్తా ఏ పరిక్షకైనా సిద్ధం:కేటీఆర్

42
ktr speech

టాలీవుడ్‌ని డ్రగ్స్‌ కేసు పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ పేరుని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేతలు ఆరోపించడాన్ని తప్పుబట్టారు మంత్రి కేటీఆర్. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం- ఈడీ కి లెటర్ ఇచ్చిన వాడు బఫున్ అని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడుతాం- అవసరం అయితే రాజద్రోహం కేసులు కూడా పెడుతాం అని హెచ్చరించారు.

అడ్రస్ లేని వ్యక్తులు కేసీఆర్ ని తిడితే ఉరుకోమని… ఉద్యమంలో కేసీఆర్ తిడితే ఆనాడు ఉద్వేగం ఉంది- ఇవ్వాళ వీళ్లకు ఏం రోగం అని ప్రశ్నించారు కేటీఆర్. సింగరేణి బాలిక ఘటన పై చట్టం తనపని తాను చేసిందని… దిశ ఘటన పై దేశం హర్షించింది..నాకు కూతురు ఉంది కన్నీళ్లు పెట్టుకున్నాం అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంను ఆదర్శంగా తీసుకుంటున్నాం…సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని తెలిపారు.

ఒకప్పుడు సున్నాలు వేసిన వ్యక్తి- ఇవ్వాళ కన్నాలు వేస్తున్నట్లు బయట ప్రచారం జరుగుతోంది… క్రిమినల్స్ కు ఛార్జిషీట్స్ మాత్రమే తెలుసు! రోజు కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు మాత్రమే చార్జిషీట్లు అంటారని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్….జానారెడ్డి కంటే పెద్దవాడు కాదు కదా!. బండి సంజయ్ కు ఓట్లు వేసిన ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు కేటీఆర్.