యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. Ask Twitter కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోందని, హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ఇవ్వడంలో కేంద్రం విఫలమైందన్న నెటిజన్.. ఎన్‌పీఏ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వదని కేటీఆర్ విమర్శించారు.
ఆరోగ్యరంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు కొత్తగా టిమ్స్ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని అప్‌డేట్ చేస్తున్నామని చెప్పారు.రైతు అనుకూల విధానాలతో ఏడేళ్లలో సాగు 120శాతం పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లపైనే హత్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఓ నెజిటన్ పేర్కొనగా.. నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించకపోవడంపై కేటీఆర్‌కు నెటిజన్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన కేటీఆర్ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించట్లేదో గంగూలీ, జై షాను అడగాలని సూచించారు.