లాక్ డౌన్‌తో కరోనా సమస్య పరిష్కారం కాదన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..కరోన వస్తే ప్రజలంతా సహకరించాలి. వేలేసినట్లు చూడొద్దన్నారు. అమిత్ షా, కర్ణాటక, మధ్య ప్రదేశ్ సీఎం లకి వచ్చింది. కరోన ఎవరికి అతీతం కాదన్నారు.
హోమ్ మినిష్టర్ మహమ్మద్ అలీ, పెద్దలు హనుమంతరావు కరోన నుంచి కొల్కొన్నారు.…హైదరాబాద్ లో కుటుంబ సభ్యులకు కరోన వస్తుంది అని వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసిందన్నారు. ప్లాస్మా డోనేషన్ కి ఎవరు ముందుకురావడం లేదు….టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్లాస్మా డోనేషన్ కి ముందుకు రావాలన్నారు.
అనవసర విమర్శలకు పోవద్దు.…మీడియా లోటు పాట్లు చూపండి…పాజిటివ్ కథనాలు హై లెట్ చేయాలన్నారు. అగ్ర రాజ్యాలు సైతం విలవిలాడుతున్నాయి.….ప్రతిపక్షాల సహకరించాలి…అనవసర విమర్శలు చేయవద్దన్నారు. వ్యాధికి చికిత్స లేదు…నివారణ ఒక్కటే మార్గం…మంత్రులు గా ఉన్న వాళ్ళం ప్రజల్లో తిరగాలి…వారికి అవగాహన కల్పించే బాధ్యత మా పై ఉందన్నారు.