సిరిసిల్లలో కరోనా ఐసీయూ సెంటర్‌…

45
ktr

సిరిసిల్ల నియోజకవర్గంలో కరోనా ఐసీయూ సెంటర్‌ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. జిల్లా పర్యటన సందర్భంగా సిరిసిల్లకు విచ్చేసిన కేటీఆర్…జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్‌ వార్డుతో పాటు కొవిడ్‌ అంబులెన్స్‌లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…..జిల్లా ఆస్పత్రికి సీఎస్‌ఆర్‌ పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తామని….సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

బాధితుల సంఖ్య పెరిగితే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా వాడుకోవాలన్న కేటీఆర్….కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో కరోనా బాధితులు 99 శాతం మంది కొలుకుంటున్నారని వెల్లడించారు.