ప్రగతి భవన్ లో రాఖీ వేడుకలు

65
pragathi bhavan

హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో రాఖీ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టారు. ఈ వేడుకల్లో సీఎం సోదరీమణులతోపాటు ఆయన సతీమణి శోభ కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కాచెల్లెళ్ల నుంచి కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

ఉదయం మాజీ ఎంపీ కవిత ఉదయం కేటీఆర్, సంతోష్‌ కుమార్‌లకు రాఖీ కట్టగా కేటీఆర్‌ కుమారుడు హిమాన్ష్‌కు సోదరి అలేఖ్య తన తల్లి శైలిమ సమక్షంలో రాఖీ కట్టింది. ఈ సందర్భంగా అన్న, చెల్లెలు ఒకరికొకరు స్వీటు తినిపించుకున్నారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.