మోదీకి జన్మదిన శుభాకాంక్షాలు తెలిపిన కేటీఆర్

411
KTR_Modi_
- Advertisement -

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షాలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోదీకి జన్మదిన శుభాకాంక్షాలు తెలిపారు.మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు.

ఆయురారోగ్యాలతో, సంతోషంతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకంక్షాలు తెలుపుతున్నారు. మరోవైపు మోదీ బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశమంతటా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమో యాప్ ను పూర్తిగా అప్ డేట్ చేశారు. . కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేశారు. ‘బెటర్, ఫాస్టర్, స్లీకర్’ ట్యాగ్ లైన్‌తో నమో కొత్త యాప్‌ని ఆవిష్కరించారు.వేగంగా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్‌తో యాప్‌ను రూపొందించారు. పాత వర్షన్ కంటే మరింత బెటర్‌గా మార్చేశారు. యాప్‌లో నమో ఎక్స్‌క్లూజివ్ అనే కంటెంట్ సెక్షన్‌ను పొందుపరించారు.

- Advertisement -