సాయంత్రం నరసరావుపేటకు కోడెల పార్ధివ దేహం

352
kodelasivaprasadarao-body-
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ , మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్ మార్టం అనంతరం కోడెల పార్ధివదేహాన్ని టీడీపీ కార్యకర్తలు, నాయకుల సందర్శనార్ధం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉంచారు. ఇక ఇవాళ సాయంత్రం కోడెల పార్ధివదేహాన్ని నరసారావుపేటకు తరలించనున్నారు.

ఈ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి కోడెల పార్థీవ దేహం గుంటూరు తరలించనున్నారు. కోదాడ, సూర్యాపేట, విజయవాడ, మంగళగిరి మీదుగా గుంటూరు పార్టీ ఆఫీసుకు కోడెల పార్థీవ దేహం తరలించనున్నారు. రేపు సాయంత్రం గుంటూరు పార్టీ ఆఫీసు నుంచి నరసరావుపేటకు తరలిస్తారు. కోడెల కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఈ సాయంత్రం లేదా బుధవారం అంత్యక్రియలు నిర్వహించాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు.

- Advertisement -