పేదల కోసం బస్తీ దవాఖానాలు: మంత్రి కేటీఆర్

169
ktr
- Advertisement -

పేదల కోసం బస్తీ దవాఖానాలు తీసుకొచ్చామని తెలిపారు మంత్రి కేటీఆర్. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహించారు. ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటిచేస్తున్న విజయ్‌ శేఖర్‌ గౌడ్‌, రషీదాబేగం, పారిజాత గౌరీ, పద్మా ప్రతాప్‌ లను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆరేళ్లలో హైదరాబాద్‌ నగరానికి ఏం చేసిందో చెప్పాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. నగరంలోని ప్రతీ డివిజన్‌లో వందల కోట్ల రూపాయలతో పనులు చేశాం. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. పేదల కోసం బస్తీ దవాఖానాలు తీసుకొచ్చామని తెలిపారు.

రాబోయే రెండు, మూడేళ్లలో ప్రతిరోజూ నీళ్లిస్తాం. హైదరాబాద్‌ పచ్చగా ఉంటే కొందరు ఓర్చుకోవడం లేదు. వేలాది మంది కార్మికులు కుత్బుల్లాపూర్‌లో స్థిరపడ్డారు. నేరాలను అరికట్టేందుకు గల్లీగల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌తో మంచినీటి సమస్య తీర్చాం. ఆరేళ్ల క్రితం రెండు వారాలకు ఒకసారి తాగునీరు వచ్చేవి హైదరాబాద్‌లో ఈ రోజు పేకాట క్లబ్‌లు లేవు అన్నారు.

గుడుంబా గబ్బు లేదు, పోకిరీల పోకడలు లేవు, ఆకతాయిల ఆగడాలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు పేలుళ్లు లేవు. ఆరేళ్ల నుంచి ఒక్క దినం కాదు కదా ఒక గంట, ఒక్క ఘడియ కూడా కర్ఫ్యూ పెట్టే పరిస్థితి లేదు. ఇది కొంతమందికి నచ్చుతలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రియై రెండేళ్లు అవుతుంది. ఆయనగానీ, బీజేపీ ప్రభుత్వంగానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలన్నారు.

- Advertisement -